ముంబై: ఒక మహిళ తన భర్త బైక్ వెనుక కూర్చొని ప్రయాణించింది. రోడ్డుపై ఉన్న గుంతలో ఆ బైక్ పడటంతో అదుపుతప్పింది. దీంతో భార్యాభర్తలు రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన మహిళ మరణించగా ఆమె భర్త గాయాలతో బయటపట్టాడు. (Woman Dies Due To Pothole) మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 47 ఏళ్ల అనిత తన భర్త అనిల్ బైక్ వెనుక కూర్చొని ప్రయాణించింది. నవ్జే గ్రామంలోని ఇంటికి వారు తిరిగి వెళ్తున్నారు.
కాగా, పాల్గఢ్-మనోర్-విక్రమ్‌గఢ్-జవహర్ హైవే గుంతమయంగా మారింది. ఈ నేపథ్యంలో అనిల్, అనిత ప్రయాణించిన బైక్ ఒక గుంతలో పడింది. అదుపుతప్పిన భార్యాభర్తలు రోడ్డుపై పడ్డారు. అనిత తలకు తీవ్ర గాయం కాగా అనిల్ స్వల్పంగా గాయపడ్డాడు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అనిత మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
IndiGo | ఇండిగోకు రూ.20 లక్షల జరిమానా.. ఎందుకంటే?
Bodies Left On Stretchers | ఫ్రీజర్ల కొరత.. స్ట్రెచర్లపైనే రోడ్డు ప్రమాద బాధితుల మృతదేహాలు
man kills wife | అత్తతో అక్రమ సంబంధం.. భార్యను హత్య చేసిన వ్యక్తి
Boy Dies Of Dog Bite | బాలుడ్ని కరిచిన కుక్క.. గుర్తించకపోవడంతో పది రోజుల తర్వాత మృతి