న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.20 లక్షల జరిమానా విధించారు. పైలట్ శిక్షణ కోసం ‘క్వాలిఫైడ్ సిమ్యులేటర్లు’ ఉపయోగించకపోవడాన్ని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తప్పుపట్టింది. (IndiGo) ఈ నేపథ్యంలో ఈ మేరకు జరిమానా విధించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బుధవారం ఈ విషయం తెలిపింది. సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో దీనిని ప్రస్తావించింది. ‘కేటగిరీ సీ’ ఏరోడ్రోమ్‌లలో పైలట్ శిక్షణ కోసం ‘అర్హత కలిగిన సిమ్యులేటర్లను’ ఉపయోగించనందుకు డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 26న ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు వివరించింది.
కాగా, అంతర్గత కమ్యూనికేషన్ల సమస్య కారణంగా ఈ విషయాన్ని వెల్లడించడంలో ఆలస్యం జరిగినట్లు సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తెలిపింది. అయితే ఈ చెల్లింపును తాము సవాల్ చేస్తామని చెప్పింది. అలాగే ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపబోదని పేర్కొంది. మరోవైపు బుధవారం నాటి స్టాక్మార్కెట్లో ఇండిగో షేర్ల విలువ స్వల్పంగా తగ్గింది.
Also Read:
Boy Dies Of Dog Bite | బాలుడ్ని కరిచిన కుక్క.. గుర్తించకపోవడంతో పది రోజుల తర్వాత మృతి
man kills wife | అత్తతో అక్రమ సంబంధం.. భార్యను హత్య చేసిన వ్యక్తి
Bodies Left On Stretchers | ఫ్రీజర్ల కొరత.. స్ట్రెచర్లపైనే రోడ్డు ప్రమాద బాధితుల మృతదేహాలు
Watch: కొండచరియలు విరిగిపడిన రోగులకు చికిత్స కోసం.. పెద్ద సాహసం చేసిన డాక్టర్