న్యూఢిల్లీ: ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై భార్య దాడి చేసింది. అతడిపై మరిగిన నూనె పోసింది. కాలిన గాయాలపై కారం పొడి చల్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. (Wife Pours Boiling Oil On Husband) దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్న 28 ఏళ్ల దినేష్ అక్టోబర్ 2న డ్యూటీ తర్వాత రాత్రి వేళ అంబేద్కర్ నగర్లో నివసిస్తున్న అద్దె ఇంటికి తిరిగి వచ్చాడు. భోజనం చేసిన తర్వాత నిద్రపోయాడు. అతడి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె సమీపంలో నిద్రించారు.
కాగా, అక్టోబర్ 3న తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో నిద్రిస్తున్న దినేష్‌పై అతడి భార్య మరిగిన నూనె పోసింది. ముఖం, మెడ, ఛాతిపై వేడి నూనె పడటంతో అతడు నిద్ర నుంచి లేచాడు. కాలిన గాయాల వల్ల అరిచాడు. అయితే అతడిపై కారం పొడి చల్లింది. అరిచి గోల చేస్తే మరింత వేడి నూనె పోస్తానని భార్య బెదిరించింది.
మరోవైపు దినేష్ అరుపులకు ఇంటి యజమాని, పొరుగువారు మేల్కొన్నారు. ఆ ఇంటి వద్దకు వెళ్లారు. తొలుత డోర్ తీసేందుకు అతడి భార్య నిరాకరించింది. అయితే దినేష్ అరుపులు ఆగకపోవడంతో డోర్ తీయాలని గట్టిగా అడిగారు. డోర్ తెరుచుకోగా కాగిన నూనె వల్ల కాలిన గాయాలైన అతడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
కాగా, దినేష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని ఇంటి యజమాని, పొరుగువారు అతడి భార్యకు చెప్పారు. అయితే ఆమె మరోచోటకు తీసుకెళ్తుండటంతో వారు అనుమానించారు. దీంతో ఆటోలో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దినేష్ ఛాతి, ముఖం, చేతులపై తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. దినేష్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంటడంతో అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, తొమ్మిదేళ్ల కిందట పెళ్లైన ఈ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. రెండేళ్ల కిందట మహిళలపై నేరాల సెల్‌కు దినేష్ భార్య ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత రాజీ ద్వారా సమస్యను వారు పరిష్కరించుకున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Mamata Banerjee | అమిత్ షా ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.. మోదీ జాగ్రత్తగా ఉండాలి: మమతా బెనర్జీ
Woman Dies Due To Pothole | భర్త బైక్ వెనుక కూర్చొన్న భార్య.. గుంతలో పడి అదుపుతప్పడంతో ఆమె మృతి
man kills wife | అత్తతో అక్రమ సంబంధం.. భార్యను హత్య చేసిన వ్యక్తి
Boy Dies Of Dog Bite | బాలుడ్ని కరిచిన కుక్క.. గుర్తించకపోవడంతో పది రోజుల తర్వాత మృతి