Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు.. 51 మంది అభ్యర్థులతో ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలి జాబితా
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు, రిటైర్డ్ పోలీసు అధికారి, వైద్యుడు, మాజీ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు.
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు, రిటైర్డ్ పోలీసు అధికారి, వైద్యుడు, మాజీ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. అవినీతిపై గళమెత్తిన ప్రశాంత్ కిషోర్, క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. తొలి జాబితా అభ్యర్థుల్లో 17 శాతం బీసీలు, 16 శాతం ముస్లిం అభ్యర్థులున్నారు.
కాగా, ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు కేసీ సిన్హా, కుమ్రార్ స్థానం నుంచి జన్ సురాజ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గతంలో పాట్నా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన ఆయన రాసిన పాఠ్యపుస్తకాలు బీహార్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాయి.
పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాది వైబీ గిరి, బీహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గాను, పాట్నా హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కేసులకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు. మాంఝీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలకు కృషి చేసిన డాక్టర్ అమిత్ కుమార్ దాస్, ముజఫర్‌పూర్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.
మరోవైపు రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ పేరు తొలి జాబితాలో లేదు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్జేడీ బలమైన స్థానం, తేజస్వీ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘోపూర్ నుంచి ఆయన పోటీ చేయవచ్చని తెలుస్తున్నది.
Also Read:
Bihar Bridge | రూ.6 కోట్లతో వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరూపయోగం
Private Jet Skids Off | టేకాఫ్ సమయంలో.. రన్‌వే నుంచి జారిన ప్రైవేట్ విమానం
Watch: కొండచరియలు విరిగిపడిన రోగులకు చికిత్స కోసం.. పెద్ద సాహసం చేసిన డాక్టర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

