రాయ్‌పూర్: మానసిక వికలాంగుడిని ఏనుగులు తొక్కి చంపాయి. (Elephants Trample Man) ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కర్తాలా అటవీ ప్రాంతం పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన 58 ఏళ్ల దివ్యాంగుడు కొన్ని నెలలుగా గ్రామ బస్టాండ్‌లో నివసిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆ ప్రాంతంలో తిరిగాడు. ఏనుగుల గుంపునకు అతడు కంటపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని తొక్కి చంపాయి.
కాగా, గ్రామ సర్పంచ్ సమాచారంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మానసిక వికలాంగుడిని ఏనుగులు తొక్కి చంపిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గత 15 రోజులుగా సుమారు 17 ఏనుగుల గుంపు రాంపూర్ గ్రామ సమీపంలో తిరుగుతున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళన చెందారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
Also Read:
Private Jet Skids Off | టేకాఫ్ సమయంలో.. రన్‌వే నుంచి జారిన ప్రైవేట్ విమానం
Bihar Bridge | రూ.6 కోట్లతో వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరూపయోగం