లక్నో: శక్తివంతమైన పేలుడు ధాటికి ఇల్లు కూలింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది వ్యక్తులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈ సంఘటన జరిగింది. (Blast In Ayodhya) ఆ జిల్లా పరిధిలోని గ్రామంలో గురువారం రాత్రి ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఆ ఇల్లు కూలిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఆ ఇంటి వంట గదిలో గ్యాస్ సిలిండర్ లేదా కుక్కర్ లేదా బాణసంచా పేలి ఉంటుందని పోలీసులు, అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే కాన్పూర్లో స్కూటర్ పేలి ఎనిమిది మంది గాయపడిన ఒక రోజు తర్వాత అయోధ్యలో ఈ పేలుడు జరుగడం కలకలం రేపింది.
Also Read:
IIIT Raipur | 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్.. స్టూడెంట్ సస్పెండ్
Man Kills Wife | భార్యను చంపి.. మృతదేహాన్ని మంచం కింద దాచిన వ్యక్తి