T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలకమైన పోరు ప్రారంభమైంది. డూ ఆర్ డై అంటూ సాగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని వెస్టిండీస్ బ్యాటర్లను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనే వ్యూహంతో ప్రోటీస్ జట్టు బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. ఇక సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం కాగా, భారత్ ఉన్న గ్రూప్‌లోనే ఈ రెండు జట్లు ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం సమీకరణాలను మార్చబోతుంది. ఇక జట్ల బలాబలాల విషయానికొస్తే, సౌతాఫ్రికా తన గత మ్యాచ్‌లో భారత్‌పై భారీ విజయాన్ని అందుకుని ఫుల్ జోష్‌లో ఉండగా, వెస్టిండీస్ కూడా జింబాబ్వేపై 107 పరుగుల తేడాతో గెలిచి మంచి ఫామ్‌ను కనబరుస్తోంది.