Sand Mafia | హత్నూర, ఫిబ్రవరి 26: కృత్రిమ ఇసుక తయారీ రాత్రి పగలు తేడాలేకుండా యధేచ్చగా కొనసాగుతుంది. కొందరు వ్యక్తులు మట్టి తవ్వకాలు జరుపుతూ వాగులో కనిపించకుండా ట్రాక్టర్లల్లో కడుగుతూ విక్రయాలు చేపడుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లల్లో ఇసుక కడుగుతూ.. ఆ ఇసుకను రాత్రి సమయాల్లో లారీల్లో దూరప్రాంతాలకు తరలిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ గ్రామ శివారులో కొందరు ఇసుకాసురులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యల్లో ట్రాక్టర నిండా మట్టిని తీసుకెళ్లి కృత్రిమ ఇసుక తయారు చేసి నిలువ ఉంచుతూ రాత్రి సమయాలలో దూరప్రాంతాలకు లారీల్లో తరలిస్తున్నారు.
చెట్ల పొదలలో నిలువ ఉంచుతూ..చదునైన నేలను తవ్వుతూ సమీప వాగులోకి తీసుకెళ్లి ట్రాక్టర్లల్లోనే కడుగుతున్నారు. కృత్రిమంగా తయారు చేసిన ఇసుకను అధికారులకు కంటపడకుండా ఉండటం కోసం చెట్ల పొదలలో నిలువ ఉంచుతూ రాత్రి సమయాలలో విక్రయాలు చేపడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతూ తయారుచేసిన ఇసుకను ఎప్పటికప్పుడు విక్రయిస్తున్నరు. అధికారుల కళ్ళుగప్పి జరుగుతున్న కృత్రిమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు కృత్రిమ ఇసుక తయారీని అడ్డుకొని మట్టి తవ్వకాలను నిలిపివేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అదేవిధంగా కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా అర్ధరాత్రి సమయాలలో భారీ లారీలలో ఇసుకను తరలించడంతో సమీపంలోని తారు రోడ్డు సైతం పూర్తిగా పూర్తిగా ధ్వంసం అవుతూ రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం