అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్ర వైఖరి ఉండాలి
దేశ స్వతంత్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్ర వైఖరిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : దేశ స్వతంత్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్ర వైఖరిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. హిమాయత్‌నగర్‌లోని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఇస్కఫ్) రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ‘ఇరాన్‌పై అమెరికా యుద్ధం-భారత్‌పై ప్రభావం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మన దేశ విదేశాంగ విధానంలో కీలకంగా ఉన్న అలీన విధానాన్ని పునరుద్ధించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నదని, భారత విదేశాంగ విధానంలో యూఎస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపించారు. భారత విద్యార్థుల చేతులకు సంకెళ్లు వేసి దేశానికి పంపిన వైఖరిని ప్రశ్నించకపోవడం ఆందోళనకరమని మండిపడ్డారు. ప్రొ. కే నాగేశ్వర్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ, భద్రతా పరిణామాల నేపథ్యంలో మన దేశం జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేలా సమతుల్యమైన, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

