హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా రూపొందించిన నూతన గీతాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఆవిషరించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని దామెర గ్రామానికి చెందిన మండల పెద్దులు కుమార్తె ప్రణీత ప్రత్యేకంగా చిత్రీకరించిన ఈ బోనాల పాటను కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రణీత కొత్తగా ప్రారంభించిన ‘ప్రణీత అఫీషియల్’ యూట్యూబ్ చానల్‌ను కూడా ఆయన ప్రారంభించారు. తెలంగాణ జానపద కళలను, పాటలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న యువతిని అభినందించిన కేటీఆర్, శాలువాతో ఆమెను ఘనంగా సన్మానించారు. పాట అత్యంత అద్భుతంగా వచ్చిందని, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ ఆవిషరణ కార్యక్రమంలో దామెర సహదేవ్, కాటబోయిన శంకరయ్య, గాజుల హరిబాబు, నక శ్రీనివాసులు, మంటిపెళ్లి శివకుమార్, వల్లపు పర్వతాలు, సిరిపంగి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. తన పాటను, యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి ప్రోత్సహించిన కేటీఆర్‌కు ప్రణీత, ఆమె కుటుంబసభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.