కారేపల్లి, ఫిబ్రవరి 26 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల వైరా నియోజకవర్గస్థాయి తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె.సుజాత, ఎం.అక్షిత, బి.కరుణ ఈ నెల 22, 23వ తేదీలలో తమిళనాడులోని చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీయస్థాయిలో నిర్వహించిన అశ్విత ఖేలో ఇండియా రబ్బీ లీగ్ పోటీలలో కాంస్య పతకాన్ని సాధించారు. అదే విధంగా వీరు ప్రాతినిధ్య వహించిన జట్టుకు రూ.48 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి గురువారం కారేపల్లికి చేరుకున్న వారి ముగ్గురికి స్థానిక బస్టాండ్ సెంటర్లో మండల విద్యాశాఖ అధికారి జయరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ దారా సావిత్రి లతోపాటు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆ విద్యార్థులతో పాటు పీడీ జారే అనుష, పీఈటీ నాగేంద్రమ్మను సన్మానించారు.

జాతీయస్థాయిలో కారేపల్లి మైనార్టీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ