Supreme Court: వివాదాస్పద బుక్‌పై సుప్రీంకోర్టు నిషేధం.. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌కు నోటీసులు
Supreme Court: ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌కు ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో.. న్యాయ వ్యవస్థ అవినీతిపై అధ్యయాన్ని రాసిన వారిపై చర్యలు తీసుకోమని ఆదేశించింది. ఆ బుక్కు చెందిన ఫిజికల్, డిజిటల్ కాపీలను సీజ్ చేయాలని కోర్టు పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం బుక్‌లో న్యాయవ్యవస్థపై వివాదాస్పద పాఠ్యాంశం ఉన్న కేసులో ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ బుక్‌ను బ్యాన్ చేస్తూ ఇవాళ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. న్యాయవ్యవస్థలో అవినీతి అన్న అంశంతో ఉన్న ఆ బుక్కు చెందిన కాపీలను సీజ్ చేయాలని కూడా సుప్రీం ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొన్నది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది. చాలా లోతైన కుట్ర జరిగినట్లు కోర్టు చెప్పింది.
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకాన్ని ప్రచురించిన బాధ్యతాయుత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొన్నది. ఈ అంశంలో చాలా లోతైన దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నామని, దీనికి కారణమైన వారిని గుర్తించాలని, వాళ్లు ఎవరో తాము తేల్చుతామని, నిశితంగా ఈ కేసును పరిశీలిస్తామని, ఈ కేసును మూసివేసే ప్రసక్తే లేదని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. కోర్టు ధిక్కరణ కేసు కింద విద్యాశాఖతో పాటు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుప్రీం తెలిపింది.
న్యాయ వ్యవస్థపై వివాదాస్పద పాఠ్యాంశాన్ని రాసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పాలని విద్యాశాఖను అడగనున్నట్లు కోర్టు పేర్కొన్నది. వివాదాస్పదమైన ఆ బుక్కు చెందిన హార్డ్ కాపీలు కానీ డిజిటల్ కాపీలను కానీ మార్కెట్ నుంచి తొలగించాలని కోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది. ఎన్సీఈఆర్టీ ప్రచురించిన క్షమాపణలను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

