AR Ameen | ఏఆర్ రెహమాన్ కొడుకుకి కారు ప్రమాదం.. తాను క్షేమంగా ఉన్నానంటూ ప్రకటన విడుదల చేసిన అమీన్!
AR Rahman | ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, సింగర్ ఏఆర్ అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నైలోని గిండి కత్తిపర ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ అపఘాతం చోటుచేసుకుంది.
AR Rahman | ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, సింగర్ ఏఆర్ అమీన్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. చెన్నైలోని గిండి కత్తిపర ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో అమీన్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై స్వయంగా అమీన్ స్పందిస్తూ తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై ఆయన సోదరి ఖతీజా రెహమాన్ స్పందిస్తూ.. అసత్య ప్రచారాలు నమ్మవద్దని, మీడియా సంస్థలు వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే వార్తలు ప్రసారం చేయాలని కోరారు.
ప్రమాదం జరిగిన సమయంలో అమీన్ తన స్నేహితుడి కారులో ప్రయాణిస్తున్నారని, ఆయన డ్రైవింగ్ చేయట్లేదని, కేవలం ప్యాసింజర్ సీట్లో కూర్చున్నారని ఖతీజా స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ కలర్లోనే ఉన్నప్పటికీ ముందున్న మరొక వాహనం ముందుకు కదలడంతో ఈ చిన్నపాటి ఢీకొనే ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఘటనలో అమీన్, ఆయన స్నేహితుడితో పాటు అవతలి వాహనంలో ఉన్నవారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. తమ కుటుంబ సభ్యులపై, శ్రేయోభిలాషులపై ఉన్న ప్రార్థనల వల్ల అందరూ క్షేమంగా బయటపడ్డారని అమీన్ పేర్కొన్నారు. తన నానమ్మ, తండ్రి ఏఆర్ రెహమాన్, జి.వి. ప్రకాష్ కుమార్ ఆశీస్సులు, నేర్పించిన విలువలే తనను కాపాడుతున్నాయని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ఇటీవల రామ్ చరణ్ చిత్రంలోని ‘చికిరి చికిరి’ తమిళ వెర్షన్‌కు అమీన్ తన గొంతును అందించారు. అలాగే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘భీగీ భీగీ’ ఇండిపెండెంట్ సింగిల్‌కు జాస్లిన్ రాయల్‌తో కలిసి పనిచేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

