రక్షిత సంచలనం
భారత యువ షట్లర్ రక్షితశ్రీ రామ్రాజ్ హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించింది.గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 19 ఏండ్ల రక్షిత 21-18, 24-22తో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన చెన్ యుఫీపై గెలిచి తన కెరీర్లోనే అతిపెద్ద విజయం సాధించింది.
- ఒలింపిక్ చాంప్ చెన్ యుఫీపై గెలుపు
- సాత్విక్ జోడీ, సేన్ ముందంజ
కౌలూన్ (హాంకాంగ్): భారత యువ షట్లర్ రక్షితశ్రీ రామ్రాజ్ హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 19 ఏండ్ల రక్షిత 21-18, 24-22తో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన చెన్ యుఫీపై గెలిచి తన కెరీర్లోనే అతిపెద్ద విజయం సాధించింది. తొలిరౌండ్లో బ్లిచ్ఫీల్డ్ను చిత్తుచేసిన ఈ కోయంబత్తూర్ అమ్మాయి.. క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన చొచువాంగ్‌తో తలపడనుంది.
ఇక మెన్స్ సింగిల్స్‌లో ఇప్పటికే వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న లక్ష్యసేన్.. 21-11, 21-18తో రస్మస్ గెమ్కె (డెన్మార్క్)ను చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్‌కు ప్రవేశించాడు. మరో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 12-21, 21-18, 21-14తో యు టే బిన్ (సౌత్‌కొరియా)ను ఓడించాడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం 21-19, 21-16తో అజ్రియాన్-కియోంగ్ (మలేషియా) జోడీపై గెలిచి క్వార్టర్స్ చేరింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంట 20-22, 13-21తో లారెన్ లామ్-అలిసన్ లీ (అమెరికా) చేతిలో ఓడి ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

