రేవంత్‌కు భూమి కనబడితే పాపం
భూమి కనబడితే పాపం అన్నట్టుగా ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటివరకు రేవంత్ సరార్ 26 వేల ఎకరాల భూములను విక్రయించిందని, మరో 20 వేల ఎకరాల భూములను బ్రోకర్ల సహాయంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో పెట్టిందని దుయ్యబట్టారు.
- సీఎం పిచ్చి తుగ్లక్ చర్యలతో భవిష్యత్తులో భూమి కొరత
- ఇప్పటికే 26 వేల ఎకరాల విక్రయం.. మరో 20 వేల ఎకరాలు స్టాక్ ఎక్సేంజీలో..
- కూకట్పల్లి ట్రక్పార్ స్థలం పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం
- రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు
- 22, 23వ తేదీల్లో ట్రక్పార్ స్థలంలో దీక్షలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్ : భూమి కనబడితే పాపం అన్నట్టుగా ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటివరకు రేవంత్ సరార్ 26 వేల ఎకరాల భూములను విక్రయించిందని, మరో 20 వేల ఎకరాల భూములను బ్రోకర్ల సహాయంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో పెట్టిందని దుయ్యబట్టారు. మరో రూ.50 వేల కోట్ల విలువైన భూములను విక్రయించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలు మరచిన రేవంత్‌రెడ్డి భూములను గ్యారెంటీగా అమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ప్రస్తుతం నీటి కొరత ఏర్పడిన విధంగానే భవిష్యత్తులో భూమి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.
కూకట్పల్లి ట్రక్పార్క్ల అమ్మకాల వ్యవహారంపై గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీపీఎం పార్టీ మేడ్చల్-మలాజిగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 1982లో కూకట్‌పల్లిలోని స్థానిక రైతుల నుంచి ప్రజా ప్రయోజనార్థం ట్రక్పార్ స్థలాన్ని సేకరించారని తెలిపారు. ప్రస్తుతం మూడు నియోజకవర్గాల మధ్యలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వం తెగనమ్మాలని నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు. కంటైనర్ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉండి, వందలాది ట్రకులు పారింగ్ చేసుకునేందుకు అవకాశం ఉన్న స్థలాన్ని విక్రయించడమంటే ఎంతోమంది ఉపాధిపై దాడి చేయడమేనని మండిపడ్డారు. నగరం నడిబొడ్డున వేలాదిమంది ఉపాధికి ఉపయోగపడుతున్న భూములను ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు.
సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టే, భూమి చుట్టూ రేవంత్ తిరుగుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు, కో ఆపరేటివ్ భూములను సైతం విచక్షణారహితంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. మూడు నియోజకవర్గాల మధ్యలో వేలాదిమందికి ఉపయోగకరంగా ఉన్న ట్రక్‌పార్క్ భూములను విక్రయించే ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 2008లోనే ఈ భూములను విక్రయించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించగా, వామపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ కలిసి అడ్డుకున్నాయని గుర్తు చేశారు. అదే ఉద్యమ స్ఫూర్తితో భూముల విక్రయాలను అడ్డుకుంటామని తెలిపారు. ఈ నెల 22, 23వ తేదీల్లో ట్రక్పార్ స్థలంలోనే నిరాహార దీక్షలు చేపట్టాలని, 25న హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

