అహ్మదాబాద్: రోడ్లపై తిరుగున్న పశువులను పట్టుకునేందుకు మున్సిపల్ కార్మికుడు ప్రయత్నించాడు. ఒక ఆవును బంధించేందుకు అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ వ్యక్తి కాలుకు తాడు చిక్కుకోవడంతో అర కిలోమీటరు దూరం వరకు ఆవు ఈడ్చుకెళ్లింది. (Cow Drags Municipal Worker) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. రోడ్లపై సంచరించి జనంపై దాడులకు పాల్పడే పశువులను పట్టుకునేందుకు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.
కాగా, అక్టోబర్ 9న ఆ బృందానికి చెందిన మున్సిపల్ కార్మికుడు మహేష్ పటేల్ ఒక ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దానిని బంధించే క్రమంలో తాడు అతడి కాలుకు చిక్కుకున్నది. ఇంతలో భయాందోళన చెందిన ఇతర పశువులతో పాటు ఆ ఆవు రోడ్డుపై పరుగులు తీసింది. ఈ నేపథ్యంలో కాలుకు తాడు చిక్కుకున్న మహేష్‌ను సుమారు అర కిలోమీటరు దూరం అది ఈడ్చుకెళ్లింది. ఈ సంఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మహేష్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంఘటనపై అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే పశువులను పట్టుకునే సమయంలో పాటించాల్సిన భద్రతా విధానాలు, పద్ధతులపై సమీక్ష జరిపింది. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Worker dragged by cow in Vadodara incident caught on CCTV
A Vadodara Municipal Corporation cattle squad worker had a narrow escape while catching a stray cow. During the operation, his leg got tangled in the rope tied to the cow, putting his life at risk. The frightened cow ran… pic.twitter.com/4gaDrNRsaW
— Our Vadodara (@ourvadodara) October 10, 2025
Also Read:
Blast In Ayodhya | అయోధ్యలో భారీ పేలుడు.. ఇల్లు కూలి ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
Woman films neighbour | నగ్నంగా మారి పొరుగు వ్యక్తి గొడవ.. వీడియో రికార్డ్ చేసిన మహిళపై దాడి