హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో సోమవారం ముందస్తు హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ అభిమానులు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి రంగులు చల్లి అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ.. మహిళా సంక్షేమ పథకాలు కేసీఆర్ హయాంలోనే బాగున్నాయని, కేసీఆర్ పదేండ్ల పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని చెప్పారు. కేసీఆర్ జిందాబాద్, మళ్లీ కేసీఆర్ రావాలి.. అంటూ నినదించారు.