హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : టీఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా దినోత్సవ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ విడుదల చేశారు. ఈ నెల 6న కోఠి మహిళా కాలేజీ ఆడిటోరియంలో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా ఉద్యోగులంతా ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్ తదితరులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.