జైపూర్: అనారోగ్యంతో మరణించిన తల్లి మృతదేహాన్ని ఆమె కుమారుడు, బంధువులు సొంతూరుకు తరలిస్తున్నారు. అంబులెన్స్‌ను అనుసరించిన వారు ప్రయాణించిన కారు లారీని వేగంగా ఢీకొట్టింది. (Road Accident) ఈ ప్రమాదంలో ఆమె కుమారుడితోపాటు మరో ఇద్దరు బంధువులు మరణించారు. ఏటీఎస్ అధికారిణి అయిన ఏఎస్ఐ జోగిందర్ కౌర్‌కు మూడేళ్ల కిందట కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం జైపూర్‌లో మరణించింది.
కాగా, హర్యానాలోని సొంతూరులో కౌర్‌కు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబం నిర్ణయించింది. దీంతో గురువారం రాత్రి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో జైపూర్ నుంచి హర్యానాలోని రోహ్తక్కు తరలించారు. కౌర్ కుమారుడైన 24 ఏళ్ల కిరాత్, ఆమె సోదరి 61 ఏళ్ల కృష్ణ , సోనిపట్‌కు చెందిన బంధువైన మహిళ, ఆమె కుమారుడు సచిన్ కారులో ఆ అంబులెన్స్‌ను అనుసరించారు.
మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రోహ్తక్లోని ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఆ కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జయ్యింది. తీవ్రంగా గాయపడిన అందులో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే కౌర్ కుమారుడైన కిరాత్, ఆమె సోదరి కృష్ణ , బంధువైన సచిన్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, మరో బంధువైన మహిళకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. జైపూర్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దల్బీర్ భార్య అయిన ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
India Gifts Ambulances To Afghanistan | ఆఫ్ఘనిస్థాన్‌కు అంబులెన్స్‌లు బహుమతిగా ఇచ్చిన భారత్
Watch: ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?