చెన్నై: కుటుంబంతో కలిసి గుడికి వెళ్లిన బాలికను పూజారి లైంగికంగా వేధించాడు. (Girl Abused By Temple Priest) హుండీలో డబ్బులు వేస్తున్న సమయంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ పూజారిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కుంభకోణం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 8న 13 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి తిరువాలంచుజిలోని ఒక ఆలయానికి వెళ్లింది. దేవుడ్ని దర్శించుకున్న తర్వాత కానుకలు వేసేందుకు ఒంటరిగా హుండీ వద్దకు ఆమె వెళ్లింది. అక్కడున్న ఆలయ ప్రధాన పూజారి ఆ బాలికను లైంగికంగా వేధించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కాగా, బాధిత బాలిక ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. చాలా సంవత్సరాలుగా ఆలయ ప్రధాన పూజారిగా పనిచేస్తున్న 75 ఏళ్ల విశ్వనాథ అయ్యర్ ఆ బాలికను లైంగికంగా వేధించినట్లు నిర్ధారించారు. సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. వృద్ధుడైన ఆ పూజారిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Blast In Ayodhya | అయోధ్యలో భారీ పేలుడు.. ఇల్లు కూలి ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
Woman films neighbour | నగ్నంగా మారి పొరుగు వ్యక్తి గొడవ.. వీడియో రికార్డ్ చేసిన మహిళపై దాడి
Watch: ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?