న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌కు ఐదు అంబులెన్స్‌లను భారత్ బహుమతిగా ఇచ్చింది. భారత్‌లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకికి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం వీటిని అందజేశారు. (India Gifts Ambulances To Afghanistan) సద్భావన సంజ్ఞగా ఆఫ్ఘనిస్థాన్‌కు 20 అంబులెన్స్‌ల బహుమతిలో భాగం ఆ దేశ విదేశాంగ మంత్రి సమక్షంలో ఐదింటిని అందజేసినట్లు ఆయన తెలిపారు.
కాగా, కరోనా మహమ్మారి సమయంతో పాటు చాలా కాలంగా ఆఫ్ఘనిస్థాన్ ప్రజల ఆరోగ్య భద్రతకు భారత్ మద్దతిస్తున్నట్లు ఎస్ జైశంకర్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆఫ్ఘన్ ఆసుపత్రులకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ యంత్రాలను కూడా అందిస్తామని తెలిపారు. రోగ నిరోధకత, క్యాన్సర్ వ్యాక్సిన్లతోపాటు యూఎస్ఓడీసీ ద్వారా ఔషధాలు, మెడికల్ సామగ్రిని సరఫరా చేసినట్లు వివరించారు.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌కు మరింత సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ఎస్ జైశంకర్ తెలిపారు. ఆరు కొత్త ప్రాజెక్టులను ఆ దేశంలో చేపడతామని చెప్పారు. ముఖ్యమైన దౌత్య చర్యలో భాగంగా కాబూల్‌లోని సాంకేతిక మిషన్‌ను భారత రాయబార కార్యాలయ హోదాకు శుక్రవారం అప్‌గ్రేడ్ చేసినట్లు ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రజల పొరుగు దేశంగా, శ్రేయోభిలాషిగా ఆ దేశ అభివృద్ధి, పురోగతిపై భారత్ చాలా ఆసక్తిగా ఉన్నదని వెల్లడించారు.
Also Read:
Woman films neighbour | నగ్నంగా మారి పొరుగు వ్యక్తి గొడవ.. వీడియో రికార్డ్ చేసిన మహిళపై దాడి
Watch: ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?