ముంబై: ఒక విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అతడ్ని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. (Student Made To Sit On Floor) విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో ప్రధానోపాధ్యాయురాలితో పాటు టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భివాండిలోని ఉర్దూ మీడియం పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అయితే అతడు స్కూల్ ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3, 4 తేదీల్లో జరిగిన యూనిట్ పరీక్షలను తరగతిలోని నేలపై కూర్చోబెట్టి రాయించారు.
కాగా, ఈ సంఘటనతో మానసికంగా కుంగిన ఆ బాలుడు జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఈ విషయాన్ని ఆ స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
మరోవైపు బాలుడి తండ్రి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఖాన్ అతిహా, ఉపాధ్యాయుడు అహ్మదుల్లాపై జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్కూల్ సిబ్బంది, సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Kills Mother | ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కొడుకు.. ఆత్మహత్యగా నమ్మించేందుకు యత్నం
Army commandos die | తీవ్ర వాతావరణం కారణంగా.. ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
Medical student raped | ఆసుపత్రి ఆవరణలోకి లాక్కెళ్లి.. వైద్య విద్యార్థినిపై అత్యాచారం
Watch: మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కున్న రైల్వే పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?