కోల్‌కతా: ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థినిని ఒక వ్యక్తి ఆసుపత్రి ఆవరణలోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Medical student raped) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన మహిళ, బెంగాల్‌లోని పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్‌లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నది.
కాగా, రెండో ఏడాది వైద్య విద్యార్థిని అయిన ఆ మహిళ శుక్రవారం రాత్రి 8.30 గంటలకు చాట్ తినేందుకు స్నేహితుడితో కలిసి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత క్యాంపస్ గేట్ వద్ద ఉన్న ఆమెను అక్కడ ఉన్న ఒక వ్యక్తి బలవంతంగా లాక్కెళ్లాడు. చీకట్లో ప్రైవేట్ ఆసుపత్రి ఆవరణ వెనుకకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్ష కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్య విద్యార్థిని బాయ్ఫ్రెండ్తోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీ సిబ్బంది, ఇతర వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Road Accident | తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుమారుడితో సహా ముగ్గురు మృతి
Watch: మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కున్న రైల్వే పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?