కేరళ మహిళా మంత్రిపై కాంగ్రెస్ దాడి!
కేరళలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం(కేఎస్‌యూ) నాయకులు మహిళా మంత్రిపై దాడికి దిగారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జిపైకి దూసుకెళ్లారు. దాడిలో మంత్రి మెడ, చేతికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీపంలో ప్రభుత్వ దవాఖానలో చేర్చారు.
- వీణా జార్జిపైకి దూసుకెళ్లిన కేఎస్‌యూ కార్యకర్తలు
- ఆమె మెడ, చేతికి గాయాలు.. ఐసీయూలో ఉంచి చికిత్స
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం(కేఎస్‌యూ) నాయకులు మహిళా మంత్రిపై దాడికి దిగారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జిపైకి దూసుకెళ్లారు. దాడిలో మంత్రి మెడ, చేతికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీపంలో ప్రభుత్వ దవాఖానలో చేర్చారు. బుధవారం వీణా జార్జి కన్నూర్ రైల్వే స్టేషన్‌కు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్టు సీపీఎం నాయకుడు పి జయరాజన్ చెప్పారు. ఘటనను సీఎం పినరయ్ విజయన్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ దుర్మార్గపు రాజకీయాలకు ఇది ఉదాహరణగా పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్తుండగా ఆమెపై దాడి జరిగిందని విజయన్ తెలిపారు.
ఈ ఘటనకు కాంగ్రెస్, దాని నేతృత్వంలోని యూడీఎఫ్ బాధ్యత వహించాలని అన్నారు. నిరాధార ఆరోపణలతో రాజకీయాలను కలుషితం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. అలప్పుజలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మహిళకు శస్త్రచికిత్స చేసి, కడుపులో కత్తెర మర్చిపోయిన ఘటనపై ప్రతిపక్షాలు వారం రోజులుగా నిరసన చేపడుతున్నాయి. కన్నూర్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు మంత్రిని చుట్టుముట్టారని, దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆమెను పక్కకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించినప్పుడు నిరసనకారుల గుంపు మధ్య ఆమె చిక్కుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

