Surekha Vani | సినిమాలకు దూరంగా ఉన్న సురేఖ వాణి.. మళ్లీ ఫిట్‌నెస్‌పై ఫోకస్, త్వరలోనే రీఎంట్రీ?
Surekha Vani | టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఒకప్పుడు హీరోయిన్లకు అక్క, వదిన, స్నేహితురాలు వంటి పాత్రల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత తల్లి, ఆంటీ పాత్రల్లోనూ మెప్పించారు. తన సహజమైన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
Surekha Vani | టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఒకప్పుడు హీరోయిన్లకు అక్క, వదిన, స్నేహితురాలు వంటి పాత్రల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత తల్లి, ఆంటీ పాత్రల్లోనూ మెప్పించారు. తన సహజమైన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే కొంతకాలంగా సురేఖ వాణి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.ఇటీవల విడుదలైన ‘కెజెక్యూ’ సినిమాలో హీరోయిన్ యుక్తికి అండగా నిలిచే ఆంటీ పాత్రలో ఆమె కనిపించారు. అయితే ఈ సినిమా మినహా ఇటీవలి కాలంలో సురేఖ వాణికి చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు కనిపించలేదు. మరోవైపు తన కుమార్తె సుప్రీతను హీరోయిన్గా పరిచయం చేసి ఆమె సినీ కెరీర్‌ను నిలబెట్టేందుకు కూడా సురేఖ వాణి కొంతకాలం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
సుప్రీతకు అవకాశాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు సురేఖ వాణి తన కుమార్తె కెరీర్‌తో పాటు తన సినీ ప్రయాణంపైనా మరోసారి ఫోకస్ పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆమె తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సురేఖ వాణి తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా కసరత్తులు చేస్తూ కనిపించారు. ఫిట్నెస్ విషయంలో ఆమె చూపిస్తున్న శ్రద్ధ, వర్కౌట్ చేసే విధానం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వీడియో చూసిన అభిమానులు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ‘సురేఖ వాణి మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారా?’, ‘ఫిట్నెస్ చూస్తుంటే ఇంకా హీరోయిన్‌లానే ఉన్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు సురేఖ వాణి వయసు విషయంలో కూడా సోషల్ మీడియాలో కొంతకాలంగా భిన్నమైన ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె వయసుపై వివిధ ఆన్లైన్ వేదికల్లో వేర్వేరు వివరాలు కనిపిస్తుండటంతో నెటిజన్లలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఆమె వయసుకు సంబంధించిన అధికారిక వివరాల విషయంలో స్పష్టత లేదు.సురేఖ వాణికి కుమార్తె సుప్రీత ఉన్న విషయం తెలిసిందే. తల్లి, కూతురు ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సురేఖ వాణి ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడంతో ఆమె రీఎంట్రీపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏవైనా కొత్త ప్రాజెక్టులు ఉన్నాయా అనే విషయంపై అధికారిక సమాచారం లేదు. అయితే తాజా జిమ్ వీడియో మాత్రం ఆమె మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతారనే చర్చకు తెరలేపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

