Bumper Offer | ఎంత సొమ్ము లెక్క పెడితే.. అంతా మీదే.. ఉద్యోగులకు చైనా కంపెనీ బంపరాఫర్
Bumper Offer | ‘అబ్బా.. ఇలాంటి బాస్ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది’ అని ఉద్యోగులందరూ ఈర్ష్య పడేలా చైనాకు చెందిన ఒక కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్ యువాన్లు (రూ. 240 కోట్లు) తన ఉద్యోగులకు బోనస్‌గా అందజేశారు. అదీ కూడా ఒక్కొక్కరికీ ఇంత మొత్తమని నిర్దేశించకుండా మీరు ఎంత లెక్కపెడతారో అంతా తీసుకుని వెళ్లమంటూ బంపరాఫర్ ఇచ్చారు.
Bumper Offer | బీజింగ్ : ‘అబ్బా.. ఇలాంటి బాస్ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది’ అని ఉద్యోగులందరూ ఈర్ష్య పడేలా చైనాకు చెందిన ఒక కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్ యువాన్లు (రూ. 240 కోట్లు) తన ఉద్యోగులకు బోనస్‌గా అందజేశారు. అదీ కూడా ఒక్కొక్కరికీ ఇంత మొత్తమని నిర్దేశించకుండా మీరు ఎంత లెక్కపెడతారో అంతా తీసుకుని వెళ్లమంటూ బంపరాఫర్ ఇచ్చారు. ఉద్యోగులు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని ఆనందంగా వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో అందరూ కంపెనీ యజమాని కుయ్ పీజున్ పెద్దమనసును మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హెనాన్ కువాంగ్‌షా క్రేన్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ఏడాది ఆర్జించిన 270 మిలియన్ యువాన్ల లాభంలో సుమారు 70 శాతాన్ని తన ఉద్యోగులకే పంచేసింది.
దీని కోసం పెద్ద హాల్లో 800 టేబుల్స్ వేసి వాటిపై కుప్పలు కుప్పల నోట్లను పరిచింది. నిర్దేశిత సమయంలో ఉద్యోగులు అందులోంచి ఎన్ని నోట్లు లెక్కపెడతారో అవన్నీ వారివేనని ప్రకటించడంతో వారు చకచకా వాటిని లెక్కపెట్టి కట్టలు కట్టి ఆనందంగా తీసుకుపోయారు. నోట్లు వేగంగా లెక్కపెట్టడం కోసం కొందరైతే కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా పొందారని సామాజిక మాధ్యమంలో మీమ్స్ వెల్లువెత్తాయి. అనంతరం సిబ్బందికి వాషింగ్ మెషీన్లు కూడా అందజేశారు. అంతేకాక కారు లోన్లు, మార్టిగేజ్ లోన్లతో ఇబ్బంది పడుతున్న యువ సిబ్బంది తమను సంప్రదిస్తే ఆర్థికంగా సహాయం చేస్తామని ప్రకటించారు. కాగా, 2002లో స్థాపించిన ఈ కంపెనీ 130 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

