హైదరాబాద్ : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్(SBL Energy Limited) పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విసాదకర సంఘటన నాగ్‌పూర్(Nagpur )జిల్లా కటోల్ సమీపంలోని రాహుల్గావ్లోని పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..ఆదివారం ఉదయం ఎప్పటిలాగే కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి భవనం ధ్వసంమైంది. 15 మంది కార్మికులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Iran Revolutionary Guard | ఖమేనీ మృతి మహా నేరం.. ప్రతికారం తీర్చుకుంటామంటున్న ఇరాన్
Renu Desai | అసభ్యకర కామెంట్స్‌పై రేణు దేశాయ్ ఫైర్.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరిక
Virosh | ఆలయాల్లో అన్నదానం.. పలువురు ఫ్యాన్స్‌కి విరోష్ కపుల్ స్వీట్ సర్ప్రైజ్