Army commandos die | తీవ్ర వాతావరణం కారణంగా.. ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
Army commandos die | తీవ్ర వాతావరణం కారణంగా ఇద్దరు ఆర్మీ కమాండోలు మరణించారు. అదృశ్యమైన ఆర్మీ జవాన్ల కోసం గత రెండు రోజులుగా వెతికారు. చివరకు మంచులో కప్పి ఉన్న ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు.
శ్రీనగర్: తీవ్ర వాతావరణం కారణంగా ఇద్దరు ఆర్మీ కమాండోలు మరణించారు. (Army commandos die) అదృశ్యమైన ఆర్మీ జవాన్ల కోసం గత రెండు రోజులుగా వెతికారు. చివరకు మంచులో కప్పి ఉన్న ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చినార్ కార్ప్స్ ఎలైట్ పారామిలిటరీ యూనిట్‌కు చెందిన లాన్స్ హవిల్దార్ పలాష్ ఘోష్, లాన్స్ నాయక్ సుజయ్ ఘోష్ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
కాగా, అక్టోబర్ 6 అర్ధరాత్రి దాటిన తర్వాత కోకెర్నాగ్లోని కిష్త్వార్ రేంజ్లో ఉగ్రవాదుల ఉనికి గురించి ఆర్మీకి సమాచారం అందింది. దీంతో అహ్లాన్ గడోల్ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లాన్స్ హవిల్దార్ పలాష్ ఘోష్, లాన్స్ నాయక్ సుజయ్ ఘోష్ అదృశ్యమయ్యారు.
మరోవైపు ఆ ఇద్దరు జవాన్ల కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల సెర్చింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం ఒక సైనికుడి మృతదేహం కనిపించగా, శుక్రవారం మరొకరిది లభించింది.
కాగా, తీవ్రమైన మంచు, చలి వాతావరణం కారణంగా ఆ ఇద్దరు జవాన్లు మరణినట్లు చినార్ కార్ప్స్ పేర్కొంది. సైనిక అధికారులతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా అమరవీరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత జవాన్ల మృతదేహాలను వారి సొంతూర్లకు తరలించారు.
Also Read:
Medical student raped | ఆసుపత్రి ఆవరణలోకి లాక్కెళ్లి.. వైద్య విద్యార్థినిపై అత్యాచారం
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర
Watch: మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కున్న రైల్వే పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

