హైదరాబాద్ : అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతి చెందిన ఇరాన్(Iran) సుప్రీం నాయకుడు ఖమేనీ మృతిపై(Khamenei death) ప్రపంచ వ్యప్తంగా నిరసనలు కొనసాగుతుండా ఇరాన్ దేశంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వ మద్దతు దారులు విషాదంలో కూరుకుపోగా మరికొన్ని చోట్ల సంబురాలు జరుపుకున్నారు. కొంతమంది వ్యక్తిగతంగా సంతాపం ప్రకటిస్తున్నారు. షియా ముస్లింల ప్రధాన యాత్రా స్థలం మషద్‌లోని ఇమామ్ రెజా మందిరంపై నల్లజెండాలు ఎగుర వేశారు.
మరోవైపు టెహ్రాన్ నగరంలో పలు ప్రాంతాల్లో జనం రోడ్ల మీదకు వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. కిరాజ్ నగర వీధుల్లోని మేడలు, బాల్కనీల నుంచి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ నినాదాలు చేయడం విశేషం. అలాగే అమెరికాలోని లాస్ ఏంజెల్స్, లండన్, మెల్బోర్న్ ప్రాంతాల్లో ఇరాన్ ప్రవాస వాసులు నియంతృత్వం నుంచి విముక్తి కలిగిందని పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.