లక్నో: ఒక వ్యక్తి ఆస్తి కోసం తన తల్లిని హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో హత్యగా తేలింది. (Man Kills Mother) దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖేర్వా గ్రామంలోని బంధువుల ఇంట్లో 55 ఏళ్ల షీలా దేవి నివసిస్తున్నది. అక్టోబర్ 9న సాయంత్రం వేళ ఆ ఇంట్లో ఆమె అనుమానాస్పదంగా మరణించింది. మృతదేహం సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. షీలా దేవి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. గొంతు నొక్కి ఆమెను హత్య చేసినట్లు రిపోర్ట్‌లో తేలింది. దీంతో షీలా దేవి మృతిపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌తోపాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించారు.
మరోవైపు షీలా దేవి కుమారుడైన 30 ఏళ్ల కిషన్ కిషోర్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. తల్లి పేరు మీద ఉన్న భూమి, ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.3 లక్షలు తన సోదరుడికి ఇస్తుందన్న భయంతో హత్య చేసినట్లు చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు. మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతడు ప్రయత్నించినట్లు వివరించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Army commandos die | తీవ్ర వాతావరణం కారణంగా.. ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
Medical student raped | ఆసుపత్రి ఆవరణలోకి లాక్కెళ్లి.. వైద్య విద్యార్థినిపై అత్యాచారం
Watch: మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కున్న రైల్వే పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?