Mension House Mallesh | టాలీవుడ్ యువ నటుడు శ్రీనాథ్ మాగంటి హీరోగా, గాయత్రి రమణ మరియు సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. ఈ సినిమా మార్చి 06న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్రబృందం ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో లాంఛ్ చేయించింది.
‘యానిమల్’ సినిమాలో రష్మిక మందన్నకు సోదరుడిగా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి, ఈ చిత్రంలో ‘మల్లేష్’ అనే రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్లో అదరగొడుతున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శోభనం రాత్రి పెళ్ళికూతురు ఇచ్చే ఒక షాకింగ్ ట్విస్ట్ వల్ల హీరో జీవితం, అతని వ్యక్తిగత రహస్యం ఊరంతా ఎలా చర్చనీయాంశంగా మారాయనేది దర్శకుడు బాల సతీష్ చాలా ఫన్నీగా, ఎమోషనల్ గా చూపించారు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతంలో “బంగారి.. బంగారి..” పాట ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలవగా, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకకు విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ వంటి ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.