రాయ్‌పూర్: ప్రేమను నిరూపించుకోవాలని ప్రియురాలి కుటుంబం కోరింది. దీంతో వారు ఇచ్చిన విషాన్ని ప్రేమికుడు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. (to prove love Man consumes poison) ఆ యువకుడి కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల కృష్ణ కుమార్ పాండో ఒక యువతిని ప్రేమించాడు. ఈ విషయం ఆ అమ్మాయి కుటుంబానికి తెలిసింది.
కాగా, సెప్టెంబర్ 25న కృష్ణ కుమార్‌ను ఆ యువతి కుటుంబం తమ ఇంటికి పిలిచింది. అతడి చేతికి విషం ఇచ్చారు. అమ్మాయిపై అతడికి ఉన్న ప్రేమను నిరూపించుకునేందుకు అది తాగాలని చెప్పారు.
మరోవైపు ఆ విషం తాగిన కృష్ణ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. తన కుటుంబానికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. వారు అక్కడకు వెళ్లి అతడ్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే కృష్ణ కుమార్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రియురాలి కుటుంబంపై ఆ యువకుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: విద్యార్థిని చుట్టుముట్టి కొట్టిన పోలీసులు.. గాయాలతో మృతి
Watch: మహిళ చెంపపై కొట్టిన ఎంఎన్ఎస్ కార్యకర్త.. తన భర్తను దూషించి దాడి చేసిందని ఆరోపణ