Sanju Samson : ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ చాలు.. క్రికెటర్ల జీవితమే మారిపోతుంది. జట్టును గెలిపించే చిరస్మరణీయ ఆటతో చరిత్రకెక్కిన ఆటగాళ్లు చాలామందే. ఇప్పుడు వారి జాబితాలో సంజూ శాంసన్(Sanju Samson) కూడా చేరిపోయాడు. టీ20 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై శివాలెత్తిపోయిన శాంసన్ భారత జట్టుకు సెమీఫైనల్ బెర్తును కట్టబెట్టాడు. టీమిండియాను సెమీస్ చేర్చిన ఈ డాషింగ్ వ్యక్తిగతంగానూ మైలురాయి సాధించాడు. మొన్నటివరకూ ఎక్కడో 60ల్లో ఉన్న అతడు.. ఏకంగా 25 స్థానాలు ఎగబాకాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై చిరస్మరణీయ అర్ధ శతంతో భారత్‌ను గెలిపించిన సంజూ శాంసన్ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకిగ్స్‌లో ముందంజ వేశాడు. ఏకంగా.. 25 స్థానాలు మెరుగుపరచుకొని ప్రస్తుతం 40వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. విండీస్‌పై 97 నాటౌట్.. ఆ ఒక్క ఇన్నింగ్స్ అతడిని టాప్-40లోకి తీసుకొచ్చింది.
🏏 ICC T20 Latest Rankings Revealed
The International Cricket Council (ICC) has released the latest T20 rankings.
Several teams and players see changes in positions.
📊 Fans are already debating the new standings!#ICCRankings #T20Cricket #CricketNews #ICC #SportsUpdate pic.twitter.com/WF2VCf5Rx9— News Junction India (@IndiaJunct60489) March 4, 2026
అయితే.. నంబర్ 1 బ్యాటర్‌గా వరల్డ్‌కప్‌లో చెలరేగి ఆడాల్సిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఫామ్ లేమితో పెద్ద ముప్పును ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్ ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్ (Sahibzada Farhan) అభికి ర్యాంక్‌కు పోటీగా మారాడు. పొట్టి కప్‌లో రెండు శతకాలతో పాక్ విజయాల్లో భాగమైన ఈ ఓపెనర్.. 848 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్‌కు అతడికి 26 పాయింట్లే తేడా. ఇంగ్లండ్ హిట్టర్ ఫిల్ సాల్ట్ మూడో ర్యాంకులో ఉన్నాడు.