భోపాల్: ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. (student thrashed by police) తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల ఉదిత్ గైకే బీటెక్ చదువుతున్నాడు. అతడి బావ బాలాఘాట్ జిల్లాలో డీఎస్పీగా పని చేస్తున్నారు.
కాగా, గురువారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ జరుపుకున్న ఉదిత్, అర్ధరాత్రి వేళ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఒకచోట పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెంబడించి కొట్టారు. ఒక పోలీస్ ఉదిత్‌ను పట్టుకోగా మరో పోలీస్ కర్రతో అతడ్ని దారుణంగా కొట్టాడు. కొట్టడం ఆపేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడి పడిపోయిన ఉదిత్‌ను స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుళ్లు సంతోష్ బమానియా, సౌరభ్ ఆర్యలను సస్పెండ్ చేశారు. వారిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. పరారీలో ఉన్న ఆ పోలీస్ కానిస్టేబుల్స్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే విద్యార్థిని పోలీసులు కొడుతున్న సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bhopal : 22 year old B. Tech student Udit was brutally thrashed by police just for partying with friends in their car. He later succumbed to injuries. A young life lost due to insensitivity of these cops who are now suspended. pic.twitter.com/dlrmgUmptU
— farhanayyubi@yahoomail.com (@farhanayyubid) October 10, 2025
Also Read:
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Watch: మహిళ చెంపపై కొట్టిన ఎంఎన్ఎస్ కార్యకర్త.. తన భర్తను దూషించి దాడి చేసిందని ఆరోపణ