కోల్కతా: లోకల్ ట్రైన్లో సీటు దొరకపోవడంతో ఒక మహిళ ఆగ్రహించింది. ప్రయాణికులపై కారం చల్లుతానని బెదిరించింది. ఒక మహిళ జోక్యంతో మరింత రెచ్చిపోయింది. ఆ కంపార్ట్మెంట్లో పెప్పర్ చల్లింది. దీంతో కారం ఘాటుకు కొందరు ఇబ్బందులకు గురయ్యారు. (woman sprays pepper on passengers) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. లోకల్ రైలు సీల్దా స్టేషన్ చేరగా ఒక మహిళ ఎక్కింది. ఆమెకు సీటు దొరకకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. హ్యాండ్ బ్యాగ్ నుంచి పెప్పర్ స్ప్రే డబ్బా తీసింది. ప్రయాణికుల ముఖంపై చల్లేందుకు ప్రయత్నించింది.
కాగా, ఒక మహిళ జోక్యం చేసుకుని ఆమెను ప్రతిఘటించింది. దీంతో ఆ యువతి మరింత రెచ్చిపోయింది. రైలు కంపార్ట్మెంట్ అంతటా పెప్పర్ స్ప్రే చేసింది. ఆ ఘాటు వాసన వల్ల అంతా దగ్గడం ప్రారంభించారు. ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
మరోవైపు ఇది చూసి మిగతా ప్రయాణికులు జోక్యం చేసుకున్నారు. ఆ మహిళను నిలదీయగా క్షమాపణ చెప్పింది. అనంతరం రైల్వే పోలీసులకు ఆమెను అప్పగించారు. కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मैडम को सीट नहीं मिली तो मैडम ने मिर्च स्प्रे छिड़क दिया दूसरी महिलाओं पर।🥰
सीट बचाने की जंग, मिर्च स्प्रे के संग! pic.twitter.com/jxZkuybuyT
— Chitraahh Commentary (@ParodyChitraahh) October 10, 2025
Also Read:
tribal girls gang raped | గిరిజన బాలికలను కిడ్నాప్ చేసి.. అడవికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం
Watch: విద్యార్థిని చుట్టుముట్టి కొట్టిన పోలీసులు.. గాయాలతో మృతి