నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 27 : ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని నల్లగొండ ఆర్ఎం కె.జానీరెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్ రూపొందించిన గోడ పత్రికను ఇతర అధికారులతో కలిసి శుక్రవారం తన ఛాంబర్లో ఆయన ఆవిష్కరించారు. ఏప్రిల్ 27న భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఏప్రిల్ 31వ తేదీ వరకు ఆర్టీసీ లాజిస్టిక్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, సీతారాముల తలంబ్రాలు కావాల్సిన భక్తులు రూ.151 చెల్లించి ప్యాకెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు సూర్యాపేట/యాదగిరిగుట్ట డిపో పరిధిలోని భక్తులు 9154298695, మిర్యాలగూడ/కోదాడ డిపో పరిధిలోని భక్తులు 9154298693, దేవరకొండ/నల్లగొండ డిపోల పరిధిలోని భక్తులు 9154298694, అలాగే రీజియన్ పరిధిలో 9154298690 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు సుచరిత, భీంరెడ్డి, డీఎంలు రాంమోహన్ రెడ్డి, రమణ, మురళి కృష్ణ, సునీత, విజయకుమారి, శ్రీనివాస్ రావ్, లాజిస్టిక్ ఏటీఎం బద్రినారాయణ పాల్గొన్నారు.