ముంబై: బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి కనిపించింది. ఆ కేక్ తిన్న 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. (Dead Lizard In Birthday Cake) మహారాష్ట్రలోని నలసోపారాలో ఈ సంఘటన జరిగింది. ఒకరి పుట్టిన రోజు వేడుక పలువురిని ఆసుపత్రిపాలు చేసింది. బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి కనిపించింది. ఆ కేక్ తిన్న తర్వాత 11 మంది ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు అకస్మాత్తుగా కడుపు, ఛాతిలో నొప్పితో బాధపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, థానేలోని కళ్యాణ్‌లో గోద్రెజ్ హిల్ ప్రాంతంలోని ఒక బ్లింకిట్ స్టోర్‌లోని ఐస్ క్రీమ్ ఫ్రీజర్‌లో ఒక ఎలుక కనిపించింది. దీంతో ఆందోళనలు వ్యక్తం కావడంతో పాటు, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
అలాగే మలాడ్ వెస్ట్‌లోని మరో బ్లింకిట్ అనుబంధ కేంద్రంలో పలు ఉల్లంఘనలను ఫుడ్ ఇన్స్పెక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ లైసెన్స్‌ను నిలిపివేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ కేంద్రాలను ఆహార భద్రతా అధికారులు తనిఖీ చేస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు బయటపడుతున్నాయి.