పాట్నా: వచ్చే నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. (NDA seat-sharing deal) కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేయనుండగా, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) , హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి.
కాగా, బీహార్ ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ఈ విషయం తెలిపారు. సీట్ల కేటాయింపును ఎన్డీయే మిత్రపక్షాలు స్వాగతించాయని చెప్పారు. ‘ఎన్డీయే మిత్రపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో సీట్ల పంపిణీని పూర్తి చేశాయి. ఎన్డీయే పార్టీల నేతలు, కార్యకర్తలు దీనిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. బీహార్ సిద్ధంగా ఉన్నది. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుంది’ అని ప్రధాన్ ట్వీట్ చేశారు.
Also Read:
Watch: విద్యార్థిని చుట్టుముట్టి కొట్టిన పోలీసులు.. గాయాలతో మృతి