జైపూర్: ఒక వ్యక్తి గోడ దూకి స్కూల్లోకి ప్రవేశించాడు. ఆ స్కూల్ టాయిలెట్లో అతడు దాక్కున్నాడు. టాయిలెట్ కోసం వెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes School Girl) బాలిక అరుపులు విన్న స్కూల్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం జైపూర్‌లోని ప్రైవేట్ స్కూల్ గోడను ఒక వ్యక్తి దూకాడు. స్కూల్ ఆవరణలోని టాయిలెట్లో అతడు దాక్కున్నాడు. ఏడేళ్ల బాలిక టాయిలెట్ కోసం అక్కడకు రాగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కాగా, బాలిక అరుపులు విన్న స్కూల్ సిబ్బంది టాయిలెట్ వద్దకు వెళ్లారు. దీంతో ఆ వ్యక్తి స్కూల్ గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే స్థానికుల సహాయంతో అతడ్ని పట్టుకున్నారు. బాధిత బాలిక జరిగిన విషయాన్ని టీచర్‌కు చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. నిందితుడైన 35 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Akhilesh Yadav | యోగి ఆదిత్యనాథ్ చొరబాటుదారుడు.. ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపండి: అఖిలేష్ యాదవ్
Watch: విద్యార్థిని చుట్టుముట్టి కొట్టిన పోలీసులు.. గాయాలతో మృతి
Watch: లోకల్ ట్రైన్లో సీటు దొరకలేదని.. ప్రయాణికులపై కారం చల్లిన మహిళ