Realme C83 5G | రియల్మి నుంచి సీ83 5జీ ఫోన్ విడుదల.. 7,000ఎంఏహెచ్ బ్యాటరీ.. ధర బడ్జెట్లోనే
Realme C83 5G : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రియల్మి ఇండియాలో మరో బడ్జెట్ రేంజ్ 5జీ ఫోన్ను లాంఛ్ చేసింది. రియల్మి సీ సిరీస్లో భాగంగా సీ83 5జీ అనే బిగ్ బ్యాటరీ ఫోన్ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది.
Realme C83 5G : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రియల్మి ఇండియాలో మరో బడ్జెట్ రేంజ్ 5జీ ఫోన్ను లాంఛ్ చేసింది. రియల్మి సీ సిరీస్లో భాగంగా సీ83 5జీ అనే బిగ్ బ్యాటరీ ఫోన్ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ల సేల్స్ ప్రారంభమయ్యాయి. తక్కువ బడ్జెట్లో మంచి బ్యాటరీ ఫోన్ కావాలనుకునేవారి కోసం ఈ ఫోన్ను తీసుకొచ్చినట్లు కంపెనీ చెబుతోంది. ఇది 4 జీబీ+64 జీబీ, 4 జీబీ+128 జీబీ, 6 జీబీ+128 జీబీ అనే మూడు వేరియెంట్లలో, బ్లూమింగ్ పర్పుల్, స్ప్రౌటింగ్ గ్రీన్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
దీనిలోని ప్రధాన ఫీచర్లు, ధర వివరాలివి. మిడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్, 6.8 అంగుళాల ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 1080 పీ వీడియో రికార్డింగ్, డ్యుయల్ వీడియో షూటింగ్, ఆండ్రాయిడ్ 16, రియల్మి యుఐ 7.0, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆరేళ్ల లాంగ్ బ్యాటరీ కెపాసిటీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 144 హెర్జ్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లే, 900 నిట్స్ అల్ట్రా బ్రైట్నెస్, ఐపీ 64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 14000 టైమ్స్ మైక్రో డ్రాప్ టెస్ట్, 212 గ్రామ్స్, 2 నానో సిమ్స్ వంటి ఫీచర్లున్నాయి. బాక్స్లో ఫోన్, ఛార్జర్, కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, బ్యాక్ కవర్, క్విక్ గైడ్ ఉంటాయి. ధరలు రూ.13,499/ రూ.14,499 /రూ.17,499.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- battery
- India
- Realme C83 5G
- sale
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

