చుంచుపల్లి, మార్చి 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సామాజిక సేవకురాలు కంచె సంకీర్తన పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ బాలాజీ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల జీవితంలో కీలకమైన దశ అని, ఇది భవిష్యత్‌కు పునాది అన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పరీక్షల సమయంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యులు షమీం పాల్గొని విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.