కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఆగ్రహం
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు.పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో శనివారం బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ సమన్వయ కమిటీల సభ్యులు, నా యకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీజీ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. వచ్చేది కేసీఆర్ పాలనేనని, మళ్లీ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని పేర్కొన్నా రు.
- సంక్షేమాన్ని విస్మరించిన రేవంత్ సర్కార్
- రాబోయే రోజుల్లో వచ్చేది కేసీఆర్ పాలనే
- బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్
- బోధన్‌లో ‘సర్’పై ముఖ్య కార్యకర్తలతో సమావేశం
బోధన్, జూలై 25: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు.పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో శనివారం బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ సమన్వయ కమిటీల సభ్యులు, నా యకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీజీ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. వచ్చేది కేసీఆర్ పాలనేనని, మళ్లీ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని పేర్కొన్నా రు. ఎక్కడచూసినా ప్రతి నోటా రేవంత్‌రెడ్డి పాల న పోవాలని అంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి గద్దె దిగకతప్పదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకం కావాలని సూచించారు.
కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రేవంత్‌రెడ్డి ద్రోహాన్ని కూడా చెబుతూ ఓటర్లను చైతన్యవంతులు చేయాలని పిలుపుఇచ్చారు. 38 నెలల పాలనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తట్టెడు మట్టిని ఎత్తిపోయలేదని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కన్నెపల్లి వద్ద లక్షా 95 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నప్పటికీ, ఆ నీటిని రైతులకు అందించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కన్నెపల్లి హౌస్ నుంచి మల్లన్నసాగర్ ద్వారా హల్దీవాగు గుండా నిజాంసాగర్‌కు నీటిని తరలించడానికి అవకాశం ఉన్నదని, అవగాహన లేని రేవంత్‌రెడ్డితో నిజాంసాగర్ నిండే అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
‘సర్’ ప్రక్రియలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని, ఈ ప్రక్రియ ముగిసిన అనం తరం పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్ ఇస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 86.96 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ‘సర్’ జిల్లా ఇన్చార్జి సుమిత్రా ఆనంద్, వివిధ మండలాల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు రవీందర్ యాదవ్, సంజీవ్ కుమార్, గోగినేని నర్సయ్య, డి.శ్రీరామ్, నర్సింగ్‌రావు, భూమ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ముషీర్ బాబా, శీలం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘సర్’లో బీఆర్ఎస్ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి
‘సర్’ ప్రక్రియలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వంద శాతం ‘సర్’ డిజిటలైజేషన్ కోసం కృషిచేయాలి. బోధన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఫారాలు అందకపోతే.. వాటిని ఓటర్లకు అందించడానికి కృషిచేయాలి.
-దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్
కార్యకర్తలకు అండగా ఉంటాం
అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్లోనే ఉంటూ పార్టీ కష్టనష్టాల్లో పాలుపంచుకుంటున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మా కుటుంబాన్ని అనేక రకాలుగా వేధింపులకు గురిచేసింది. అయినప్పటికీ, ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.
– ఆయేషా ఫాతిమా, బీఆర్ఎస్ నాయకురాలు
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Bodhan
- BRS activists
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

