గోదావరికి పోటెత్తుతున్న వరద
గోదావరిలో వరద పోటెత్తుతోంది. నీటిపారుదల శాఖ ప్రవాహ అంచనాలను తగ్గించి చెప్తున్నదని అధికారుల ప్రకటనతో తేలిపోయింది. నీటిపారుదల శాఖ వెల్లడిస్తున్న గణాంకాల్లో వ్యత్యాసాలపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘గోదావరిలో తప్పిన ‘వరద’ లెక్క’ కథనానికి అధికారులు స్పందించారు. ప్రవాహ లెకలను సరిచేశారు.
- ప్రవాహం గణాంకాల్లో నీటి పారుదల శాఖ తేడాలు
- ‘నమస్తే తెలంగాణ’ కథనంతో సవరించిన అధికారులు
- మేడిగడ్డ వద్ద 1,22,660, సమ్మక్క బరాజ్ వద్ద 1,65,300 క్యూసెక్కులు ఉన్నట్లు ప్రకటన
మహదేవపూర్/కన్నాయిగూడెం, జూలై 25: గోదావరిలో వరద పోటెత్తుతోంది. నీటిపారుదల శాఖ ప్రవాహ అంచనాలను తగ్గించి చెప్తున్నదని అధికారుల ప్రకటనతో తేలిపోయింది. నీటిపారుదల శాఖ వెల్లడిస్తున్న గణాంకాల్లో వ్యత్యాసాలపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘గోదావరిలో తప్పిన ‘వరద’ లెక్క’ కథనానికి అధికారులు స్పందించారు. ప్రవాహ లెకలను సరిచేశారు. కాళేశ్వరం వీఐపీ ఘాట్ వరకు గోదావరి వరద చేరినప్పటికీ, మేడిగడ్డ బరాజ్ వద్ద కేవలం 22,200 క్యూసెకులు, అలాగే సమ్మక బరాజ్ వద్ద 65వేల క్యూసెకులకుపైగా ప్రవాహం నమోదవుతున్నదని అధికారిక లెక లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ‘నమస్తే’ కథనంతో అధికారులు తాజా వివరాలు విడుదల చేశారు.
ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్ వద్ద మొత్తం ఇన్, అవుట్ ఫ్లో 1,22,660, సమ్మక్క బరాజ్ వద్ద 1,65,300 క్యూసెక్కులు ఉన్నట్లు ప్రకటించారు. దీంతో గతంలో వెల్లడించిన గణాంకాలు సవరించినట్లు స్పష్టమైంది. స్థానిక ప్రజలు, రైతులు కూడా గోదావరిలో పెరుగుతున్న ప్రవాహానికి అనుగుణంగా కచ్చితమైన సమాచారం వెల్లడించాలని కోరుతున్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను పారదర్శకంగా తెలియజేయడం అధికారుల బాధ్యత అని అభిప్రాయపడుతున్నారు. ‘నమస్తే తెలంగా ణ’ ప్రత్యేక కథనంపై రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- Floods
- Floods flowing
- Godavari
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

