IND vs NZ | ఫైనల్లో టాస్ ఓడిన భారత్.. అందరి కళ్లు అభిషేక్‌పైనే..!
IND vs NZ : పొట్టి ప్రపంచకప్‌లో దుమ్మురేపిన భారత్, న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్‌కు వేళైంది. నల్లని ఎర్రని మట్టితో తయారు చేసిన పిచ్ మీద టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
IND vs NZ : పొట్టి ప్రపంచకప్‌లో దుమ్మురేపిన భారత్, న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్‌కు వేళైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇరుజట్లు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. నల్లని ఎర్రని మట్టితో తయారు చేసిన పిచ్ మీద టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
టాస్ గెలిచిన మిచెల్ శాంట్నర్ ఛేదనకే మొగ్గు చూపడంతో భారత హిట్టర్లు బ్యాట్లకు పని చెప్పేందుకు సిద్దమవుతున్నారు. టైటిల్ పోరు కోసం కివీస్ ఒక మార్పు చేయగా.. సూర్యకుమార్ సేన సెమీస్ ఆడిన టీమ్‌తోనే ఆడనుంది. మెగా టోర్నీలో విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మపైనే అందరి కళ్లు నిలువనున్నాయి.
Presenting #TeamIndia‘s Playing XI for the #Final 🙌
Updates ▶️ https://t.co/5LXBod8bl1#T20WorldCup | #MenInBlue | #INDvNZ pic.twitter.com/FkOPQTAn5p
— BCCI (@BCCI) March 8, 2026
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా.
న్యూజిలాండ్ తుది జట్టు : టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషం, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, జాకబ్ డఫ్ఫీ.
రికార్డుల పరంగా ఐసీసీ ఫైనల్స్‌లో భారత్‌పై 2-1తో న్యూజిలాండ్‌దే పైచేయి. అయితే.. సన్నాహక సిరీస్‌లో కివీస్‌లో 4-1తో చిత్తు చేసిన సూర్యకుమార్ యాదవ్ సేన మరే జట్టుకు సాధ్యంకాని విధంగా వరుసగా రెండో కప్‌ను.. మొత్తంగా మూడో ట్రోఫీని కొల్లగొట్టాలని పట్టుదలతో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

