లక్నో: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్ జారడంతో పట్టాలపై పడ్డాడు. పైకి లేచిన అతడు బైక్ తీయబోయాడు. రైలు రావడాన్ని గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే రైలు ఢీకొట్టడంతో అతడు మరణించాడు. (Man Falls From Bike, Run Over By Train ) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని దాద్రి ప్రాంతంలో నివసించే తుషార్ ఆదివారం బైక్‌పై నోయిడా వెళ్లాడు.
కాగా, ఒక రైల్వే క్రాసింగ్ వద్ద బైక్‌పై పట్టాలు దాటేందుకు తుషార్ ప్రయత్నించాడు. బైక్ జారటంతో దానితో సహా రైలు పట్టాలపై పడ్డాడు. పైకి లేచిన అతడు బైక్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే రైలు రావడాన్ని గమనించి తప్పించుకునేందుకు ముందుకు పరుగెత్తాడు. రైలు ఢీకొట్టడంతో తుషార్ అక్కడికక్కడే మరణించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుషార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ऐसे भी क्या जल्दी थी ?
इस बाइक सवार को देखिये.ट्रेन से पहले क्रॉसिंग पार करना छह रहा था. बाइक स्लीप कर गई और इससे पहले कि युवक संभल पाता। ट्रेन आ गई और जान चली गई. यह दर्दनाक हादसा ग्रेटर नोएडा में हुआ है. pic.twitter.com/jM5sgVmYMj
— Priya singh (@priyarajputlive) October 13, 2025
Also Read:
Akhilesh Yadav | యోగి ఆదిత్యనాథ్ చొరబాటుదారుడు.. ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపండి: అఖిలేష్ యాదవ్
Man Rapes School Girl | స్కూల్ టాయిలెట్లో దాక్కొని.. బాలికపై వ్యక్తి అత్యాచారం
Watch: విద్యార్థిని చుట్టుముట్టి కొట్టిన పోలీసులు.. గాయాలతో మృతి