hoax bomb threat : వరుసగా నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 50కిగా బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. గత ఐదు రోజుల్లోనే వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్‌పై విచారణ జరపగా నిందితుడి వ్యవహారం తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజుల్లో ముంబై, ఢిల్లీ నగరాలతోపాటు గుజరాత్, ఇతర రాష్ట్రాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
స్కూల్స్, మెట్రో స్టేషన్లు, ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సహా వివిధ సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీనిపై ముంబై, గుజరాత్ సహా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. అందులో గుజరాత్ పోలీసులు ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని, తక్షణ విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్ విశ్వాస్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు గుర్తించారు. వెంటనే గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా నిందితుడి కోసం గాలించారు. పశ్చిమ బెంగాల్ చేరుకుని స్థానిక పోలీసుల సాయంతో సౌరవ్ విశ్వాస్ను అరెస్టు చేశారు. నిందితుడు ఫిబ్రవరి 27న ముంబైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడు. రెండు రోజుల్లో బాంబులు పేల్చేస్తానని బెదిరించాడు.
ఇలా పలు స్కూల్స్, మెట్రో స్టేషన్స్, ఇతర సంస్థలకు బెదిరింపు మెయిల్స్ చేశాడు. అతడి బెదిరింపు మెయిల్స్‌తో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మొత్తంగా 50కిపైగా మెయిల్స్ పంపినట్లు గుర్తించారు. అతడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేయగా.. అనంతరం ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వివిధ చోట్ల అతడిపై కేసులు నమోదయ్యాయి.