భువనేశ్వర్: గంజాయి అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు కొత్త పంథా అవలంబించారు. గంజాయి సంచులను శరీరానికి చుట్టుకుని తాళ్లతో కట్టుకున్నారు. (Ganja Wrapped Around Body) వాటిపై చొక్కాలు ధరించి రైలులో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. నిఘా సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు రైల్వే పోలీసులతో కలిసి వారిని పట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశాలోని టిట్లాగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
కాగా, ఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో రైలులో ఉన్న ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి చొక్కాలు విప్పించారు. దీంతో శరీరానికి చుట్టుకొని తాళ్లతో కట్టుకున్న గంజాయి సంచులు బయపడ్డాయి. ఆరుగురు నిందితులు తమ దుస్తుల కింద దాచిన రూ.2.22 లక్షల విలువైన 22.92 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు మధ్యప్రదేశ్‌కు చెందిన నిందితులు ఒడిశా నుంచి ఆ రాష్ట్రానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా, నిందితులు తమ దుస్తుల లోపల శరీరాలకు చుట్టుకున్న గంజాయి సంచులను రైల్వే పోలీసులు బయటకు తీసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#ଦେହସାରା_ପୁଳାପୁଳା_ଗଞ୍ଜେଇ
ଦେହରେ ଷ୍ଟିକର୍ ଲଗାଇ ଗଞ୍ଜେଇ ଚାଲାଣ। ଆପଣ ବି ଦେଖିଲେ ତାଜୁବ ହୋଇଯିବେ । ବାଇକ୍, ବୋଲେରୋ କି ବ୍ୟାଗରେ ନୁହେଁ, ଶରୀରରେ ଗଞ୍ଜେଇକୁ ଷ୍ଟିକର୍ ମାରି ତା ଉପରେ ସାର୍ଟ ପିନ୍ଧି ଚାଲାଣ କରୁଥିଲା ଅଭିଯୁକ୍ତ ପର୍ଦ୍ଦାଫାସ କରିଛି ବଲାଙ୍ଗିର ଜିଲ୍ଲା ଟିଟିଲାଗଡ଼ ରେଳବାଇ ପୋଲିସ ।#Bolangir #Odisha #OTV pic.twitter.com/l425f6F54R— ଓଟିଭି (@otvkhabar) October 13, 2025
Also Read:
Watch: రైల్వే ట్రాక్ దాటుతుండగా బైక్ పైనుంచి పడిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Rapes School Girl | స్కూల్ టాయిలెట్లో దాక్కొని.. బాలికపై వ్యక్తి అత్యాచారం
Akhilesh Yadav | యోగి ఆదిత్యనాథ్ చొరబాటుదారుడు.. ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపండి: అఖిలేష్ యాదవ్