కోల్కతా: ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి చేతిలోని నవజాత శిశువును ఒక మహిళ అపహరించింది. తన తల్లితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. (Stealing Newborn) దర్యాప్తు చేసిన పోలీసులు ఆ తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు. ఆ శిశువును క్షేమంగా తల్లి వద్దకు చేర్చారు. పశ్చిమ బెంగాల్లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుర్ద్వాన్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెలెఫా ఖాతున్ 18 రోజుల కిందట పండంటి బాబుకు జన్మనిచ్చింది.
కాగా, మంగళవారం డాక్టర్ను కలిసేందుకు సెలెఫా ఖాతున్ తన చేతిలోని శిశువు, తల్లితో కలిసి మెటర్నరీ వార్డు నుంచి బయటకు వచ్చింది. అక్కడి ఆవరణలో ఆమె కూర్చున్నది. ఇంతలో ఒక మహిళ అక్కడకు వచ్చింది. శిశువును జాగ్రత్తగా పట్టుకోమని సెలెఫా ఖాతున్కు చెప్పింది. ఉన్నట్టుండి ఆమె చేతిలో ఉన్న బిడ్డను తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. షాకైన సెలెఫా ఖాతున్ కుటుంబం శిశువు అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు శిశువు అపహరణ వార్త వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఖగ్రాగఢ్ సమీపంలోని ఉత్తరపారాలోని ఇంట్లో అపహరించిన మహిళ ఒడిలో శిశువు ఉండటం చూసి పొరుగువారు అనుమానం వ్యక్తంచేశారు. అయితే వారిని నమ్మించేందుకు ఆమె ప్రయత్నించింది. నమ్మశక్యం కాకపోవడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, మంగళవారం రాత్రి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ శిశువును కాపాడారు. దొంగిలించిన రింకీ ఖాతున్, అలియాస్ రుంకీ ఖాతున్, ఆమె తల్లి మినీరా బీబీని అరెస్ట్ చేశారు. ఆ నవజాత శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తల్లి ఒడికి చేర్చారు. తల్లీకూతుర్లైన ఇద్దరు మహిళలు ఆ శిశువును ఎందుకు అపహరించారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: రైల్వే ట్రాక్ దాటుతుండగా బైక్ పైనుంచి పడిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి.. ఎందుకంటే?