లక్నో: రైల్వేకు చెందిన రూ.70 లక్షల డబ్బుతో ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగి పారిపోయాడు. దీంతో ఆ కంపెనీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు షాక్ అయ్యారు. (Employee Flees With Railways’ Rs 70 Lakh ) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. ఝాన్సీ రైల్వే డివిజనల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి డబ్బు తరలించి ఎస్బీఐ రైల్వే స్టేషన్ బ్రాంచ్‌లో జమ చేసే బాధ్యతను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్నది. ఝాన్సీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో నివసించే ఆ సంస్థ ఉద్యోగి అన్షుల్ సాహుకు ఆ పని అప్పగించారు.
కాగా, అక్టోబర్ 10,11,12 తేదీల్లో ఝాన్సీ రైల్వే స్టేషన్లో సమకూరిన రూ.69,78,642ను అన్షుల్ సాహు కలెక్ట్ చేసుకున్నాడు. అయితే రైల్వే బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా ఆ డబ్బుతో అతడు పారిపోయాడు. ఈ విషయం తెలుసుకుని రైల్వేతోపాటు ఆ ప్రైవేట్ సంస్థ అధికారులు షాక్ అయ్యారు.
మరోవైపు ఆ ప్రైవేట్ సంస్థ మేనేజర్ గౌరవ్ గార్గ్, ఝాన్సీలోని నవాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.70 లక్షల రైల్వే డబ్బుతో పారిపోయిన ఉద్యోగి అన్షుల్ సాహుకు సంబంధించిన వివరాలు, గుర్తింపు పత్రాలను పోలీసులకు అందజేశారు. దీంతో పరారీలో ఉన్న అతడ్ని పట్టుకుని ఆ డబ్బు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
doctor kills wife | సర్జరీలో వినియోగించే మత్తు మందు ఇచ్చి.. భార్యను హత్య చేసిన డాక్టర్
Engineering Student Raped | ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం.. క్లాస్మేట్ అరెస్ట్
Watch: బెంగళూరు మెట్రో ట్రైన్లో అడుక్కున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?