కోల్‌కతా: ఇంజినీరింగ్ విద్యార్థినిని క్లాస్మేట్ అత్యాచారం చేశాడు. (Engineering Student Raped) ఆమె రూమ్‌కు వెళ్లి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఇతర రాష్ట్రానికి చెందిన మహిళ కోల్‌కతాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నది. ఆనందపూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, క్లాస్మేట్ అయిన వ్యక్తి ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. మత్తు మందు కలిపిన డ్రింక్ ఆమెకు ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజులపాటు దాక్కున్న నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత ఈ కేసు వెలుగులోకి రావడం కలకలం రేపింది.
Also Read:
doctor kills wife | సర్జరీలో వినియోగించే మత్తు మందు ఇచ్చి.. భార్యను హత్య చేసిన డాక్టర్
Stealing Newborn | ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ.. తల్లి, కుమార్తె అరెస్ట్
Watch: ఏనుగు తోక లాగిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?